వరల్డ్ వైడ్ సూపర్ స్ట్రాంగ్ గా “మేజర్”..రెండు రోజుల వసూళ్ల వివరాలు.!

Published on Jun 5, 2022 1:41 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా దర్శకుడు శశి కిరణ్ తిక్క నటించిన లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా “మేజర్”. రియల్ లైఫ్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం అందరి అంచనాలు అందుకొని ఫస్ట్ డే సూపర్ ఓపెనింగ్స్ అందుకుంది.

అయితే ఫస్ట్ డే 13 కోట్లకి పైగా గ్రాస్ ను అందుకున్న ఈ చిత్రం రెండో రోజు కూడా ఎక్కడా డ్రాప్ అవ్వకుండా మంచి నెంబర్ ని ప్రపంచ వ్యాప్తంగా నమోదు చేసింది. మరి ఈ రెండు రోజులకి గాను ఈ చిత్రం 24.5 కోట్లు గ్రాస్ ని అందుకున్నట్టుగా అధికారికంగా తెలియజేసారు. అది శేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఇక మూడో రోజుతో అయితే స్యూర్ గా 30 కోట్లు దాటేయడం కన్ఫర్మ్. మరి ఓవరాల్ గా అయితే మేజర్ ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :