“మేజర్” మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పటివరకు ఎంతంటే?

Published on Jun 16, 2022 1:00 am IST

ముంబై ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌, సాయి మంజ్రేకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా, జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా కలిసి నిర్మించాయి.

జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లను కూడా రాబట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల ప్లస్ మార్క్ దాటినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం లభిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :