అక్కడ “మేజర్” స్పెషల్ షో అనంతరమే గ్రాండ్ ప్రీ రిలీజ్..!

Published on May 29, 2022 9:00 am IST


మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “మేజర్”. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి ఇప్పుడు దగ్గర పడుతుంది. అయితే ఇది వరకు ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమాకి కూడా చెయ్యని విధంగా రిలీజ్ కి ముందే స్పెషల్ ప్రీమియర్స్ షో లని ప్లాన్ చెయ్యగా మేకర్స్ ఇప్పుడు ఒక్కో ప్రాంతంలో ఈ షో లను ప్రదర్శితం చేస్తున్నారు.

అయితే ఇదిలా ఉండగా ఈ షోస్ లో అడివి శేష్ మాత్రం తాను పెరిగిన వైజాగ్ లో స్క్రీనింగ్ ని మరింత స్పెషల్ గా తీసుకున్నాడు. అయితే విశాఖలో ఈ మే 29 సాయంత్రం 4 గంటలకి మేజర్ స్పెషల్ షో పడనుండగా ఈ షో అనంతరమే అక్కడే గ్రాండ్ ప్రీ రిలీజ్ ని ప్రేక్షకుల సమక్షంలో చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ నటించింది.

సంబంధిత సమాచారం :