అక్కడ “మేజర్” ప్రీమియర్ టికెట్స్ రెండు నిమిషాల్లోనే సోల్డ్!

Published on May 31, 2022 6:08 pm IST

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ చిత్రం మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం విడుదల కి ముందే దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షో ల ను నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ మేరకు బెంగళూరు లో సైతం ప్రీమియర్ షో ను నిర్వహించడం జరిగింది. ఈ షో కి రెండు నిమిషాల్లో టికెట్స్ సోల్డ్ అవ్వడం విశేషం.

ఈ చిత్రం లో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. జూన్ 3 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సూపర్ స్టార్ మహేష్ సైతం నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :