త్వరలోనే అడవి శేష్ “మేజర్” రిలీజ్ తేదీపై క్లారిటీ..!

Published on Feb 3, 2022 1:32 am IST

అడవి శేషు హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మేజర్”. ముంబై ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రానికి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ రాబోతుంది. సరైన సమయంలో, సరైన తేదీకి “మేజర్” రిలీజ్ కానుందని అడవి శేషు తెలిపాడు. ఇకపోతే ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :