పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ లో కీలక మార్పు

katamarayudu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘కాటమరాయుడు’ రెగ్యులర్ షూటింగ్ ఎట్టకేలకు నిన్న సికింద్రాబాద్ లో ప్రారంభమైంది. కానీ పవన్ మాత్రం ఈ నెల 24 నుండి షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ షెడ్యూల్ 15రోజుల పాటు హైదరాబాద్ లోనే జరగనుంది. అయితే ఈ చిత్రంలో ఓ కీలక మార్పు జరిగినట్టు తెలుస్తోంది. అదేమంటే ఈ సినిమాకి మొదట సినిమాటోగ్రాఫర్ గా సౌందర్ రాజన్ ను అనుకున్నారు. గతంలో ఇతను రవితేజ చిత్రం ‘బెంగాల్ టైగర్’ కు పనిచేశారు. కానీ చిత్రం అనుకున్న టైమ్ కి మొదలుకాకపోవడంతో ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట.

ఇక ఈయన స్థానంలో పవన్ కెరీర్లోనే బిగ్గెట్స్ హిట్ గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వహించిన ప్రసాద్ మురెళ్ళ ను తీసుకున్నారట. దీంతో ప్రాజెక్టుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగిపోతోంది. ‘నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిసున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నాడు.