ఓవర్సీస్ లో అదరగొడుతున్న “మేజర్” వసూళ్లు.!

Published on Jun 5, 2022 11:46 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ చిత్రం “మేజర్” కోసం ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు మాట్లాడుతున్నాడు. మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొదటి రోజు కన్నా రెండో రోజు నుంచి విడుదల అయ్యిన అన్ని చోట్ల నుంచి సాలిడ్ వసూళ్లను అందుకుంటుంది.

మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం ఓవర్సీస్ లో మాత్రం రాక్ సాలిడ్ గా అదరగొడుతున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం 7 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి 1 మిలియన్ మార్క్ వైపు సింపుల్ గా దూసుకెళ్లిపోతుంది.

అలాగే ఈ చిత్రం అడివి శేష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలుస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ మరియు సోనీ పిక్చర్స్ ఇండియా వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :