అక్కడ మంచి జంప్ అందుకున్న “మేజర్” చిత్రం..!?

Published on Jun 5, 2022 7:01 am IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ చిత్రం “మేజర్”. దర్శకుడు శశి కిరణ్ తిక్క తెరకెక్కించిన ఈ చిత్రం రియల్ లైఫ్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తీయబడింది. అయితే అన్ని అంచనాలు అందుకున్న ఈ సినిమా ఒక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యింది. అయితే మన దగ్గర అంచనాలు అందుకొని మంచి ఓపెనింగ్స్ అందుకోగా హిందీలో మాత్రం కాస్త తక్కువ ఓపెనింగ్స్ అనుకుంది.

కానీ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో అయితే ఈ సినిమా హిందీ బెల్ట్ లో ఫస్ట్ డే కన్నా రెండో రోజు బాగా జంప్ అయ్యిందని తెలుస్తోంది. మరింత మంది ప్రేక్షకులను ఈ సినిమా థియేటర్స్ కి రాబడుతుండగా రెండో రోజు బెటర్ వసూళ్లు ఈ సినిమా రాబడుతుంది అని అంటున్నారు. మరి మేజర్ రెండో రోజు హిందీలో ఎలాంటి నెంబర్ నమోదు చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ ఇండియా వారి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :