“మేజర్” కి టోటల్ గా భారీ లాభాలు..ఎలాగంటే..!

Published on Jun 12, 2022 8:00 am IST


టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “మేజర్”. దర్శకుడు శశి కిరణ్ తిక్క రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొంది అడివి శేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

అయితే ఈ సినిమా టోటల్ బిజినెస్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఈ చిత్రంకి బడ్జెట్ మొత్తం ప్రమోషన్స్, పబ్లిసిటీతో కలుపుకొని 35 కోట్లు లోపే అవ్వగా.. థియేట్రికల్ బిజినెస్ మాత్రం 27 కోట్లే జరిగింది. కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ మాత్రం ఈ సినిమా భారీగా దీనితో ఈ సినిమాకి సాలిడ్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇక ఈ వివరాలు చూస్తే..

ఈ సినిమా ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ వారు 16 కోట్లకి కొనుగోలు చేయగా హిందీ శాటిలైట్ హక్కులు 8 కోట్లు, తెలుగు శాటిలైట్ హక్కులు 7 కోట్లు అలాగే ఓవరాల్ మ్యూజిక్ మరియు మళయాళం శాటిలైట్ హక్కులు ఒక్కో కోటి జరిగాయి. దీనితో ఒక్క నాన్ థియేట్రికల్ హక్కులే ఈ చిత్రానికి 33 కోట్లు వచ్చేసాయి. దీనితో ఈ సినిమాకి భారీ లాభాలు వచ్చాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :