స్మాల్ గ్లింప్స్ తో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన “మేజర్”… థియేటర్ల లోనే!

Published on Feb 22, 2022 11:15 am IST

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాశం ఆధారం గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రం ను సోని పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్ టైన్మెంట్స్ మరియు A+S మూవీస్ పతాకాల పై మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ ను చిత్ర యూనిట్ ఒక చిన్న గ్లింప్స్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం ను మే 27, 2022 వ తేదీన థియేటర్ల లో భారీగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. తాజాగా విడుదల అయిన వీడియో కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :