చిరు “గాడ్ ఫాథర్” పై లేటెస్ట్ మేజర్ అప్డేట్..!

Published on Feb 17, 2022 11:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో రెండు రీమేక్ సినిమాలు ఉండగా రెండు డైరెక్ట్ చిత్రాలు ఉన్నాయి. మరి వీటిలో దర్శకుడు మోహన్ రాజా తో ప్లాన్ చేసిన భారీ చిత్రం “గాడ్ ఫాథర్” ఒకటి.

మళయాళ బ్లాక్ బస్టర్ చిత్రం “లూసిఫర్” కి రీమేక్ గా అదిరే హంగులతో తెరకెక్కిస్తున్నారు. అలాగే భారీ తారాగణంతోనే తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మరి ఇప్పుడు తాను ఈ సినిమాపై ఒక లేటెస్ట్ అండ్ మేజర్ అప్డేట్ ని అందించారు.

ఈరోజు తాను లేడీ సూపర్ స్టార్ నయనతార పై ఒక కీలక షెడ్యూల్ ని పూర్తి చేసానని.. వరుసగా మూడోసారి ఆమెతో వర్క్ చెయ్యడం ఎంతో ఆనందంగా ఉందని తాను తెలిపారు. ఇక ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :