“RRR” మ్యానియా టైం లో “గని” రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.!

“RRR” మ్యానియా టైం లో “గని” రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.!

Published on Mar 29, 2022 5:23 PM IST


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అంతా కూడా భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” మ్యానియా మరియు హిస్టీరియా లో ఉంది. ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ వసూళ్లను అందుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తున్న ఈ సినిమా రిలీజ్ కి పోటీగా మరే ఇతర సినిమాలు కూడా రిలీజ్ కి రాలేదు. మరి ఇది వచ్చిన వారం రోజులకి ఆ తర్వాత వారంకి సినిమాలు విడుదల అవుతున్నాయి. అలా ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యిన రెండు వారాలకి వస్తున్న మరో చిత్రం “గని”.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ పై చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అల్లు బాబీ మరియు సిద్ధూ ముద్ద మాట్లాడుతు ఈ సినిమా రిలీజ్ నాటికి RRR మ్యానియా కొంత తగ్గొచ్చని అలాగే మా సినిమాలో కూడా మంచి సబ్జెక్టు ఉందని అందుకే రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉన్నా కాన్ఫిడెంట్ గా రిలీజ్ కి వస్తున్నామని తెలిపారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు