“ఇండియన్ 3” ట్రైలర్ ఎప్పుడో కన్ఫర్మ్ చేసిన మేకర్స్..

“ఇండియన్ 3” ట్రైలర్ ఎప్పుడో కన్ఫర్మ్ చేసిన మేకర్స్..

Published on Jul 11, 2024 10:11 AM IST


ప్రస్తుతం రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు శంకర్ అలాగే లోక నాయకుడు కమల్ హాసన్ ల కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం ఇండియన్ కి సీక్వెల్ గా ప్రస్తుత తరానికి తగ్గట్టుగా డిజైన్ చేసిన సినిమాగా ఇది రాబోతుంది.

అయితే మరీ అన్ని ఎక్కువ అంచనాలు ఈ సినిమాపై లేవు కానీ ఈసారి ఎలా ఉంటుందో అని కొంతమంది అయితే చూడాలి అనుకుంటున్నారు. అలా ఈ భారీ సినిమా వస్తుండగా మేకర్స్ ఈ సినిమాకి మరో సీక్వెల్ పార్ట్ 3 ని కూడా ఇది వరకే అనౌన్స్ చేసేసారు.

అయితే రీసెంట్ గా పార్ట్ 2 తో ఇండియన్ 3 ట్రైలర్ ని జోడిస్తున్నట్టుగా బజ్ వచ్చింది. ఇక దీనిని అయితే లేటెస్ట్ గా మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు. ఇండియన్ 2 చివరిలో పార్ట్ 3 ట్రైలర్ వస్తుంది అది ఇంకా గ్రాండ్ గా ఉంటుంది. అలాగే పార్ట్ 2 వచ్చిన 6 నెలల తర్వాత పార్ట్ 3 ని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు