రజినీ స్పెషల్ రోల్ ని కన్ఫర్మ్ చేసిన మేకర్స్.!

రజినీ స్పెషల్ రోల్ ని కన్ఫర్మ్ చేసిన మేకర్స్.!

Published on Nov 5, 2022 2:00 PM IST

తమిళ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో నిన్నటి నుంచి అయితే అభిమానులు మంచి ఎగ్జైటింగ్ గా ఉన్నారు. తలైవర్ 170వ సినిమా ఏది అనౌన్స్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తాను స్పెషల్ అపీరెన్స్ ఇచ్చే చిత్రంపై ఇప్పుడు ఈరోజు అధికారిక అప్డేట్ అయితే వచ్చేసింది. “లాల్ సలాం” అనే ఈ చిత్రంలో తమిళ హీరో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ సంతోష్ లు హీరోలుగా నటిస్తున్నారు.

అలాగే ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ అయితే దర్శకత్వం వహిస్తుంది. మరి ఈ చిత్రంలో రజిని కూడా కనిపిస్తారని పలు రూమర్స్ అయితే రాగా ఇప్పుడు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు తమ చిత్రంలో రజినీ స్పెషల్ అపీరెన్స్ ఇవ్వనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీనితో అయితే ఇప్పుడు తలైవర్ ఫ్యాన్స్ మంచి ఎగ్జైట్ గా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఆరంభం అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు