లేటెస్ట్: “విశ్వంభర” పై అదిరే అప్డేట్ ఇచ్చిన మేకర్స్

లేటెస్ట్: “విశ్వంభర” పై అదిరే అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Published on Jul 4, 2024 11:56 AM IST


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష (Trisha) హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) మరో ముఖ్య పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఫుల్ స్వింగ్ లో షూటింగ్ ని పూర్తి చేసుకుంటుండగా చిరు కూడా షూటింగ్ లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ చిత్రాన్ని ఆన్ టైం పూర్తి చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా నేడు సంగీత దర్శకుడు కీరవాణి బర్త్ డే సందర్భంగా చిరు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా అందించారు. అయితే ఈ అప్డేట్ సహా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు మరో సాలిడ్ అప్డేట్ ని అయితే ఈ సినిమా విషయంలో అందించారు. దీనితో ఈ చిత్రం తాలూకా డబ్బింగ్ ని నేటి నుంచి పూజా కార్యక్రమాలతో ఆరంభిస్తున్నట్టుగా రివీల్ చేశారు.

అలాగే ఈ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా షూటింగ్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు రివీల్ చేశారు. దీనితో విశ్వంభర మాత్రం జెట్ స్పీడ్ లో కంప్లీట్ అయ్యి ఆన్ టైం రిలీజ్ కి రానుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కి ఫిక్స్ చేసి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు