నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ రన్‌టైమ్ 2 గంటల 49 నిమిషాలు ఉండబోతున్నట్లు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలిపారు. ‘దసరా’ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, సినిమాలో చూపించబోయే తీవ్రమైన వయొలెన్స్ కారణంగా సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో మేకర్స్ మాట్లాడిన తీరు చూస్తుంటే, వారు ఎలాంటి రాజీపడకుండా ఈ డార్క్ యాక్షన్ ప్రపంచాన్ని తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. టీజర్‌తోనే ఇంటెన్స్ వైబ్‌ను ఇచ్చిన ఈ టీమ్, సుదీర్ఘమైన రన్టైమ్తో ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమా అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది. మరి సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తుందో వేచి చూడాలి.
