చిన్న హింట్ తో కేజీఎఫ్ 3 పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

Published on Apr 15, 2022 1:00 am IST


యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 ఈరోజు విడుదలైంది. భారీగా థియేటర్ల లో విడుదల అయిన ఈచిత్రం అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సినిమా క్లైమాక్స్ లో మేకర్స్ ఒక చిన్న హింట్ ను ఇచ్చారు. కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని లీడ్ ఇచ్చారు. ఈ చిన్న టీజ్ అభిమానులను చాలా థ్రిల్ చేసింది. ఇది పూర్తిగా ఊహించనిది మరియు దాని గురించి ఇప్పటివరకు ఎటువంటి చర్చ కూడా జరగలేదు. అయితే ప్లాట్లు ఓపెన్‌గా ఉంచబడినందున, ఈ మూడవ భాగం ఎప్పుడు రూపొందుతుంది మరియు కథ ఎక్కడికి వెళుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించగా, రవి బస్రూర్ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :