బంగార్రాజు రిలీజ్ పై మేకర్స్ ఏమన్నారంటే?

Published on Jan 5, 2022 1:16 am IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ను అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై సంయుక్తం గా నిర్మించడం జరిగింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం ను జనవరి 15 న విడుదల చేస్తున్నట్లు గతం లో ప్రకటించినా, అందుకు తగ్గ విధంగా ప్రమోషన్స్ లేకపోవడం తో విడుదల పై పుకార్లు వినిపిస్తున్నాయి. ఓటిటి ద్వారా కూడా విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వస్తున్న ఈ పుకార్ల పై చిత్ర యూనిట్ తాజాగా స్పందించడం జరిగింది. బంగార్రాజు చిత్రం పై వస్తున్న పుకార్ల ను నమ్మవద్దు అని, ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ థియేటర్ల లోనే రిలీజ్ చేయనున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే విడుదల తేదీ పై ఎలాంటి క్లారిటీ లేదు.

సంబంధిత సమాచారం :