“గని” కొత్త విడుదల తేదిని చూస్తున్నాడా?

Published on Dec 21, 2021 3:00 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “గని”. అల్లు అరవింద్ సమర్పణలో రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీలపై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా, ఇటీవల విడుదల తేదీని మార్చినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్రలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :