‘హను – మాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలిన మేకర్స్.!

Published on Sep 16, 2021 10:50 am IST


ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి వస్తున్న ఎన్నో ఆసక్తికర చిత్రాల్లో ఫస్ట్ ఎవర్ ఇండియన్ రియల్ సూపర్ హీరో అయినటువంటి హనుమంతుని కాన్సెప్ట్ తో వస్తున్న భారీ చిత్రం “హను – మాన్” కూడా ఒకటి. టాలెంటెడ్ అండ్ యువ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది.

ప్రశాంత్ తన మొదటి సినిమాతోనే కొత్తరకం సినిమాలను ట్రై చేసి నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకోగా ఒక్కొక్కటిగా డిఫరెంట్ జానర్స్ ను టచ్ చేస్తూ వెళ్తున్నాడు. మరి అలా టేకప్ చేసిన ఈ భారీ సూపర్ హీరో చిత్రమే ‘హను మాన్’. అనౌన్సమెంట్స్ తోనే ఆసక్తి రేపిన ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ మరో అదిరే అప్డేట్ ను రివీల్ చేసేందుకు రంగం సిద్ధం చేసారు.

ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో వచ్చే సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ‘అంజనాద్రి నుంచి తమ హనుమంతు ని కలుసుకోవచ్చని’ తెలిపారు. మరి బహుశా ఇది ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కావచ్చు అన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమా పరంగా మాత్రం టాలీవుడ్ ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ అప్డేట్ ఏంటి అన్నది తెలియాలి అంటే అప్పుడు వరకు ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :