‘కాంతారా – 2’ పై క్రేజీ అప్ డేట్ అందించిన మేకర్స్

Published on Mar 23, 2023 12:30 am IST

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ కాంతారా. మొదట కన్నడ లో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న ఈ మూవీ అనంతరం పలు ఇతర భారతీయ భాషల్లో కూడా రిలీజ్ అయి అన్నిచోట్ల సంచలన విజయం నమోదు చేసింది. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మించారు. అయితే ఈ సినిమా సీక్వెల్ ని మరింత గ్రాండ్ గా తీసేందుకు సిద్ధం అవుతున్నట్లు ఇటీవల నిర్మాత విజయ్ కిరాగందూర్ తెలిపారు.

మరి ఈ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే ఆసక్తి అన్ని భాషల ఆడియన్స్ లో ఉంది. ఇక నేడు ఉగాది పండుగ సందర్భంగా కాంతారా 2 కి సంబంధించి మేకర్స్ అఫీషియల్ గా ఒక క్రేజీ అప్ డేట్ అయితే అందించారు. దర్శకడు, హీరో అయిన రిషబ్ శెట్టి ఈ సీక్వెల్ యొక్క స్టోరీ సిద్ధం చేసే పనిని మొదలుపెట్టారని కొద్దిసేపటి క్రితం ఒక అఫీషియల్ పోస్టర్ ద్వారా తెలిపారు. దానితో ఒక్కసారిగా ఈ న్యూస్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా రాబోయే రోజుల్లో ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :