కనీవినీ ఎరుగని రీతిలో “ఆర్ఆర్ఆర్” మూవీ భారీ రిలీజ్!?

Published on Nov 17, 2021 4:26 pm IST

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం ను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఇద్దరూ ఈ చిత్రం లో నటిస్తుండటం తో సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో అంతకు మించిన భారీ స్కేల్ తో రాజమౌళి ఈ చిత్రం ను తెరకెక్కించినట్లు ఇటీవల విడుదల అయిన టీజర్ ను చూస్తే తెలుస్తుంది.

ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని మొత్తం 10,000 కి పైగా స్క్రీన్స్ లో ప్రదర్శించనున్నారు మేకర్స్. అంతేకాక యూ ఎస్ లో కూడా 2,500 కి పైగా స్క్రీన్ లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ నిలిచే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :