విశ్వక్ సేన్ “ధమ్కీ” రిలీజ్ అప్పుడే?

Published on Feb 20, 2023 10:21 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తదుపరి ధమ్కీలో కనిపించనున్నారు. విశ్వక్ సేన్ హీరోగా మాత్రమే కాకుండా, దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ డ్రామాలో నివేదా పేతురాజ్ కథానాయిక గా నటిస్తుంది. ఫిబ్రవరి 17, 2023 న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ధమ్కీ విడుదల తేదీని ప్రకటించకుండా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఓ పబ్ సాంగ్‌ను పూర్తి చేసింది చిత్రబృందం. రావు రమేష్, రోహిణి, అజయ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ల పై సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :