రజనీ ‘రోబో-2’ ఆడియో వేడుక ఇండియాలో కాదు !

7th, September 2017 - 09:47:51 AM


సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో పాటు దక్షిణాది సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘రోబో-2’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్స్ తో మాత్రమే సరిపెట్టిన చిత్ర టీమ్ టీజర్, ఆడియోను ఎప్పుడు రిలీజ్ చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఒక ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. అదేమిటంటే ఈ సినిమా ఆడియో కార్యక్రమాన్ని ఇండియాలో కాకుండా దుబాయ్ లో చేయాలని నిర్మాణ సంస్థ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీన్నిబట్టి చూస్తే ఇప్పటి వరకు జరిగిన శంకర్ సినిమాలన్నీ ఒక ఎత్తైతే ఈ ‘రోబో-2’ మరొక ఎత్తని అర్థమవుతోంది. అంతేగాక సినిమాను కూడా కేవలం ఇండియా వరకే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తం చేయడానికి హాలీవుడ్ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు టీమ్.