‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ పై అంచనాలు పెంచేస్తున్న మేకర్స్

‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ పై అంచనాలు పెంచేస్తున్న మేకర్స్

Published on Feb 23, 2024 8:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ సరిపోదా శనివారం. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూట్ జరుపుకుంటోంది.

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈమూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ని ఫిబ్రవరి 24న అనగా రేపు ఉదయం దానిని ఉదయం 11 గం. 59 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

నాచురల్ స్టార్ మాస్ ఎనర్జీ కోసం రేపటి వరకు వెయిట్ చేయండి అంటూ కొద్దిసేపటి క్రితం నాని షాడో లుక్ లో ఉన్న పిక్ ని రిలీజ్ చేసారు. మొత్తంగా ఈ విధంగా సరిపోదా శనివారం గ్లింప్స్ పై అంచనాలు పెంచేస్తోంది టీమ్. మొదటి నుండి అందరిలో మంచి క్రేజ్ కలిగిన ఈ ప్రాజక్ట్ యొక్క రిలీజ్ డేట్ ని రేపటి గ్లింప్స్ లో ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు