తలపతి విజయ్ చిత్రం కోసం మలయాళ నటుడు?

Published on Jun 16, 2022 12:35 pm IST


తలపతి విజయ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. బీస్ట్ చిత్రం తో ప్రేక్షకులను, అభిమానులను అలరించిన ఈ హీరో విక్రమ్ చిత్రం తో భారీ హిట్ సాధించిన లోకేష్ కనగరాజు తో చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో వీరు మాస్టర్ చిత్రం కోసం పని చేయడం జరిగింది. మళ్ళీ ఈ కాంబో లో సినిమా వస్తుండటం తో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రం లో ఒక కీ రోల్ కోసం మలయాళ నటుడు తో డైరెక్టర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కథను ఇప్పటికే నెరేట్ చేసిన ఈ డైరెక్టర్ ఆ నటుడి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మలయాళం లో ఒక స్టార్ హీరో అన్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయ్ మరియు లోకేష్ చిత్రం కావడం తో ఈ చిత్రం లో భారీ స్టార్స్ ఉండే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :