బన్నీ సినిమాలో మలయాళ నటుడు !

స్టార్ డైరైక్టర్ త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా త్వరలో షూటింగ్ కి సన్నద్ధం అవుతొంది. కాగా తాజాగా ఈ సినిమాలో మరో మలయాళ నటుడు నటించబోతున్నాడు. మలయాళంలో ప్రముఖ నటుడు జయరామ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు.

ఇక ఇప్పటికే సుశాంత్, నవదీప్ లు కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. ఈ చిత్రం కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అంట. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Exit mobile version