మళయాళం “మాస్ట్రో” కూడా ఓటిటిలోనే అట.!

Published on Sep 19, 2021 2:00 pm IST

లేటెస్ట్ గానే ఓటిటి లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాల్లో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “మాస్ట్రో” కూడా ఒకటి. హిందీ బ్లాక్ బస్టర్ హిట్ అంధ ధూన్ కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో ఎలా అయితే ఓటిటిలో రిలీజ్ అయ్యిందో ఇప్పుడు మళయాళం తో రీమేక్ గా తీసిన సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కావడానికి రెడీ అయ్యింది.

మరి మళయాళంలో స్టార్ హీరో పృద్వి హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా రవి కె చంద్రన్ దర్శకత్వంలో “భరమమ్” గా తెరకెక్కించారు. మరి ఈ చిత్రం నేరుగా వచ్చే అక్టోబర్ 7 న రిలీస్ చెయ్యడానికి ఫిక్స్ చేశారు. మరి అటు హిందీ మరియు ఇప్పుడు తెలుగులో కూడా సూపర్ హిట్టయిన ఈ చిత్రం మళయాళంలో ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ చిత్రంలో మమతామోహన్ దాస్ కీలక పాత్రలో నటించగా వయ కామ్ 18 స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :