చరణ్-శంకర్ ప్రాజెక్ట్‌లోకి మరో పవర్ఫుల్ విలన్..!

Published on Oct 27, 2021 3:01 am IST


మెగా హీరో రామ్ చరణ్-శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగు పూణేలో జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో మలయాళ నటుడు సురేశ్ గోపీ నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా బలమైనదిగా కనిపిస్తుందని, ఆ పాత్రకు సురేశ్ గోపీ అయితే సరిగ్గా సెట్ అవుతాడని దర్శకుడు శంకర్ ఆయనను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే కాకుండా ఈ సినిమాలో సురేశ్‌ గోపి భార్యగా ఇషాగుప్తా నటించనున్నారని, ఆమెది కూడా నెగెటివ్‌ రోల్‌ అనే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :