“మళ్లీ మొదలైంది” ఫస్ట్ సింగిల్.. ఆకట్టుకుంటుందిగా..!

Published on Aug 21, 2021 9:06 pm IST

అక్కినేని మేనల్లుడు సుమంత్ హీరోగా, నైనా గంగూలి హీరోయిన్‌గా కీర్తి కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం “మళ్ళీ మొదలైంది”. పెళ్లి జీవితం, విడాకుల నేపథ్యంలో సాగే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్ అయ్యింది.

‘ఏంటో ఏమో జీవితం’ అంటూ సాగే ఈ పాటను నితిన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది మ్యూజిక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే సుహాసిని, పోసాని కృష్ణమురళీ, మంజుల ఘట్టమనేని ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఫస్ట్ సింగిల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :