‘మళ్ళీ పెళ్ళి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

Published on May 18, 2023 8:32 pm IST

వికె నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఎమ్ ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా మళ్ళీ పెళ్ళి. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరోవైపు మూవీకి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా జోరుగా నిర్వహిస్తోంది యూనిట్. సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి ఈ సినిమాకి సంగీతం అందించారు. మే 26న తెలుగు, కన్నడ భాషలలో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 21న హైదరాబాద్ ఫిలింనగర్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 6 గం. ల నుండి గ్రాండ్ గా పలువురు ప్రేక్షకాభిమానుల సమక్షంలో నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇంకా ఈ సినిమాలో జయసుధ, శరత్‌బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ వంటి వారంతా ఇతర పాత్రలలో నటించారు. మరి రిలీజ్ తరువాత ఈ ఫామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :