టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “మళ్ళీ పెళ్లి”

Published on Sep 13, 2023 4:02 pm IST

సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ ఎం.ఎస్ రాజు దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మళ్ళీ పెళ్లి. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ ఆదివారం ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో మధ్యాహ్నం 1:00 గంటలకి సినిమా ప్రసారం కానుంది. విజయ కృష్ణ మూవీస్ పై నరేష్ నిర్మించిన ఈ చిత్రంకు సురేష్ బొబ్బిలి, అరుల్ దేవ్ సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :