అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిన బాలయ్య !


నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘పైసా వసూల్ ‘ అడుగడుగునా అభిమానుల్ని ఉత్తేజపరుస్తూ విడుదలకు దగ్గరవుతోంది. ఫస్ట్ లుక్ దగ్గర నుంచి స్టంపర్, ట్రైలర్, పాటలు, ఆడియో వేడుక ఇలా అన్ని అంశాల్లోనూ చిత్రం ఫ్యాన్స్ అంచనాలను తగ్గట్టే ఉంది. దీంతో సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీస్థాయి అంచనాలు నెలకొన్నాయి.

వీటికి తోడు ఈరోజు విడుదలైన బాలకృష్ణ పాడిన ‘మామా ఏక్ పెగ్ లా’ సాంగ్ ప్రోమో కూడా ఫుల్ ఎనర్జీతో ఉండి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పాటను చూస్తే థియేటర్లో బాలయ్య అభిమానులకు మాస్ ట్రీట్ ఖాయమనిపిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శ్రియ, ముస్కాన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా కైరా దత్ స్పెషల్ పాటలో అలరించనుంది.