‘యాత్ర – 2’ సెట్స్ లో జాయిన్ అయిన మమ్ముట్టి

Published on Sep 21, 2023 7:10 pm IST


మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ యాత్ర 2. ఇక 2019 లో రిలీజ్ అయి మంచి విజయం సొంతం చేసుకున్న యాత్ర మూవీకి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. ఇటీవల యాత్ర 2 నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర తెరకెక్కగా ఆయన కుమారుడైన ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర 2 రూపొందనున్నట్లు తెలుస్తోంది.

అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో నటుడు మమ్ముట్టి జాయిన్ అయ్యారట. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వి సెల్యులాయిడ్, త్రి ఆటమ్ లీవ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 ఫిబ్రవరి లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. అయితే ఈ మూవీలో జగన్ పాత్రలో కోలీవుడ్ యంగ్ యాక్టర్ జీవ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :