వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టినే ఎందుకు తీసుకున్నారంటే.. !

Yatra2

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో చాలామంది స్టార్ హీరోలు ఉండగా.. మమ్ముట్టి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో.. ఈ చిత్ర దర్శకుడు మహి.వి.రాఘవ్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

మహి.వి.రాఘవ్ మాట్లాడుతూ.. వైఎస్సార్ పాత్రలో తెలుగులోని ఓ స్టార్ హీరోతోనే మొదట నటింపజేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల, వాళ్ళు ఇందులో వైఎస్సార్ పాత్రలో నటించడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వైఎస్సార్ గొప్పతనం చెప్పే సినిమా ఇది. పైగా వైకాపా అధికారంలో కూడా లేదు. అందుకే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిగారిని సంప్రదించాం. ఆయన చాలా అద్భుతంగా చేశారు.

ఇక ‘యాత్ర’ చిత్రం ఫిబ్రవరి 8న విడుదలవుతుంది. ఇక ఈ సినిమాలో వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.

Exit mobile version