మమ్ముట్టి “వన్” ట్రైలర్ విడుదల…30 నుండి ఆహా లో!

Published on Jul 27, 2021 7:06 pm IST

సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వంలో మమ్ముట్టి, గాయత్రి అరుణ్, మాథ్యూ థామస్, నిమిష సంజయన్, జోజు జార్జ్, శ్రీజ దాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం వన్. ఈ చిత్రం తెలుగు ప్రీమియర్ గా విడుదల అయ్యేందుకు సిద్దం కానుంది. ప్రముఖ ఓటిటి ఆహా వీడియో ఈ చిత్రాన్ని జులై 30 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యం లో ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ లో మమ్ముట్టి చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. విడుదల అయిన ట్రైలర్ పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రం జూలై 30 వ తేదీన ఆహా లో విడుదల కానుండటం తో సినిమా పై ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :