డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన మమ్ముట్టి సరికొత్త చిత్రం!

Published on Jan 16, 2022 11:34 pm IST


మమ్ముట్టి మరియు పార్వతి తిరువోతు హీరో హీరోయిన్ లుగా రతీన పిటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం పుషు. క్రైమ్ థ్రిల్లర్ సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం ను సిన్ సైల్ సెల్యులాయిడ్ బ్యానర్ పై ఎస్. జార్జి నిర్మించడం జరిగింది. జేక్స్ బెజాయ్ సంగీతం అందించిన ఈ చిత్రం విడుదల కి సిద్ధం అయ్యింది.

ఈ చిత్రం ను డైరెక్ట్ డిజిటల్ గా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మమ్ముట్టి కెరీర్ లో డైరెక్ట్ డిజిటల్ గా విడుదల కావడం ఇదే తొలిసారి. సోనీ లివ్ లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డైరెక్ట్ డిజిటల్ కే పలువురు సినీ నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :