డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న మమ్ముట్టి “టర్బో”

డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న మమ్ముట్టి “టర్బో”

Published on Jul 10, 2024 10:01 PM IST

మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి ఇటీవల యాక్షన్ డ్రామా టర్బోలో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల రూపాయల గ్రాస్‌ను రాబట్టింది. పులిమురుగన్, పోక్కిరి రాజా వంటి విజయవంతమైన కమర్షియల్ ఎంటర్టైనర్‌లను తెరకెక్కించిన వైశాఖ్ టర్బో చిత్రానికి దర్శకుడు. ఈ బిగ్గీ యొక్క స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఓటిటి ప్లాట్‌ ఫామ్ నుండి తాజా అప్డేట్ ఇక్కడ ఉంది. ఆగస్ట్ 9 నుండి టర్బో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రం చెప్పిన తేదీ నుండి పలు భాషలలో ప్రసారం చేయాలని భావిస్తున్నారు. ఇందులో శాండల్‌వుడ్ నటుడు రాజ్ బి శెట్టి విలన్‌గా నటించారు. ప్రముఖ తెలుగు హాస్యనటుడు సునీల్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. అంజనా జయప్రకాష్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్, బిందు పనికర్ లు ఇతర కీలక పాత్రలు పోషించారు. మమ్ముట్టి కంపనీ బ్యానర్‌ పై మమ్ముట్టి టర్బోను నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు