‘బాహుబలి’ని లీక్ చేసిన నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

‘బాహుబలి’ని లీక్ చేసిన నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Published on Nov 22, 2016 3:49 PM IST

baahubali-2

నిన్న సాయంత్రం ‘బాహుబలి – 2’ లీకేజ్ వీడియో బయటికొచ్చి నానా హంగామా సృష్టించింది. ఈ చర్యతో నిర్మాతలు, దర్శకుడు ఇతర టీమ్ అంతా అవాక్కయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమా ఎలా లీక్ అయిందో వారికి అర్థంకాలేదు. గతంలో మొదటి భాగం కూడా ఇలాగే లీక్ అయింది. అప్పుడేమీ చేయలేకపోయిన నిర్మాతలు ఈసారి మాత్రం విషయాన్నీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. వందల కోట్లు, వందల మంది కష్టాన్ని పణంగా పణంగా పెట్టి తీసిన సినిమాని లీక్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలనుకుని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు పిర్యాదు చేశారు.

దీంతో విషయాన్ని విచారించిన పోలీసులు సన్నివేశాలను లీక్ చేసింది ఆ టీమ్ లోని కృష్ణ అనే వ్యక్తని తెలుసుకున్నారు. అన్నపూర్ణ స్థూడియోస్ లో బాహుబలి గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. కృష్ణ కూడా అక్కడే గ్రాఫిక్స్ ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతనే సన్నివేశాలను దొంగిలించి బయటకు లీక్ చేసి విజయవాడకు వెళ్ళిపోయాడు. పోలీసులు కృష్ణను విజయవాడలోనే అరెస్ట్ చేశారు. ఇకపోతే లీకైన సన్నివేశాలను ఇప్పటికే సైబర్ క్రైమ్, యాంటీ పైరసీ టీమ్ లు ఇంటర్నెట్ నుండి తొలగించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు