ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ బిగ్గెస్ట్ హిట్ చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు (Shankara Vara Prasad Garu). మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో మెప్పించి సెన్సేషనల్ రన్ ని థియేటర్స్ లో చూపిస్తుంది. ఇలా మొత్తం 5 రోజులు రన్ ని ఈ సినిమా కంప్లీట్ చేసుకోగా 5 రోజులు పూర్తి కాకుండానే ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసి బాక్సాఫీస్ బ్లాస్ట్ గా నిలిచింది.
ఇక మొత్తం 5 రోజుల్లో ఎంత రాబట్టింది అనేది మేకర్స్ ఇప్పుడు రివీల్ చేశారు. ఈ సినిమా మొత్తం 226 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టినట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ వీకెండ్ కూడా సాలిడ్ హోల్డ్ ని ఈ చిత్రం కనబరుస్తుంది. సో ఈజీగా 6వ రోజుకి 250 కోట్ల క్లబ్ లో ఈ చిత్రం చేరిపోతుంది అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ రన్ లో ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుంది అనేది వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించారు. అలాగే సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం వహించారు.
#ManaShankaraVaraPrasadGaru continues to conquer every territory with unanimous dominance 😎🔥
₹226 Crore+ gross worldwide in just 5 days for the #MegaSankranthiBlockbusterMSG ❤️🔥❤️🔥
ALL-TIME RECORD FOR A REGIONAL FILM 💥💥💥
A sensational weekend is on the cards for #MSG 🔥 pic.twitter.com/hopeIaUK89
— Shine Screens (@Shine_Screens) January 17, 2026
