
అక్కినేని ఫ్యామిలీ హీరోలైన ఎఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ సొంత బ్యానర్ బ్యానర్ లో నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మనం’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. టాలీవుడ్ మరియు అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అక్కినేని నాగేశ్వర రావు చివరి సారిగా నటించిన సినిమా కావడం వల్ల ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, నీతూ చంద్ర అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఆడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.