ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల సంభవించిన తిత్లీ తూఫాన్ అక్కడ అపారనష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఈ తూఫాన్ దెబ్బకు అక్కడి గ్రామాలూ త్రీవంగా నష్టపోయాయి. ఇక తాజాగా గా అజిల్లాలోని 6 గ్రామాల ప్రజలకు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచంద సంస్థ ‘మన సైతం’ అండగా నిలిచింది.
తమ వంతు సాయం గా అక్కడి వారికీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్రముఖ హీరోలు తమ వంతు సాయం గా విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
