మానస్ లాంచ్ చేసిన ‘ఓన్లీ గుడ్ ఫుడ్’ రెస్టారెంట్

మానస్ లాంచ్ చేసిన ‘ఓన్లీ గుడ్ ఫుడ్’ రెస్టారెంట్

Published on Aug 8, 2024 11:18 AM IST


హైదరాబాద్ వాసులకు రుచికరమైన ఫుడ్‌ని అందించేందుకు మరో రెస్టారెంట్ సిద్ధమైంది. మాదాపూర్ నుంచి కైతలాపూర్ వెళ్లే మార్గంలో ‘ఓన్లీ గుడ్ ఫుడ్’ అనే రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రారంభమైంది. లంచ్ బాక్స్ ఫర్ కార్పోరేట్ క్యాటరింగ్స్‌ను రియల్ ఎస్టేట్ వ్యాపారి తారక్ ప్రారంభించారు. కాగా ఈ హోటల్ ఓపెనింగ్‌కి బిగ్‌బాస్ ఫేం మానస్ నాగులపల్లి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఆయన రిబ్బన్ కట్ చేసి హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించటానికి ముఖ్యకారణం తారక్‌ గారు. నేను ఏం తిన్నా కూడా చాలా హైజిన్‌గా ఉండాలి. తారక్‌ ఈ విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నాడు. మంచి ఫుడ్‌ను సర్వ్‌ చేయాలి కానీ ఎవరైనా ఎంత దూరమైనా వచ్చి తింటారు. ఓ.జి.ఎఫ్‌ సక్సెస్‌ అవ్వాలని అనేక బ్రాంచిలు రావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

రెస్టారెంట్‌ ఓనర్‌ తారక్‌ మాట్లాడుతూ..‘‘కూడు, నీడ, గుడ్డ ప్రతి ఒక్కరికీ అవసరం. అందులో మొదటగా వచ్చేది ఫుడ్‌. నాకు వ్యక్తిగతంగా మంచి ఫుడ్‌ తినటం, వండి పెట్టడం రెండూ ఇష్టమే. అందుకే రియల్‌ ఎస్టేట్‌లో చాలా బిజీగా ఉన్నాకూడా మనవాళ్లు మంచి ఫుడ్‌ తినాలి అనే ఉద్ధేశ్యంతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాను. ఓ.జి.ఎఫ్‌ను చక్కని బ్రాండ్‌గా తయారు చేసి త్వరలోనే అనేక బ్రాంచీలను నెలకొల్పుతాను’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీశ్‌ నాగరాజ్‌ తదితరులు పొల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు