సమీక్ష : మనసా వాచా – కొత్తదనం లేని రొమాంటిక్ థ్రిల్లర్

Manasa Vaacha movie review

విడుదల తేదీ : మార్చి 15, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : తేజస్, కరిష్మా కార్పల్, తాగుబోతు రమేష్.

దర్శకత్వం : ఏం వి ఆనంద్

నిర్మాత : గణేష్ పాల

సంగీతం : కేశవ్ కిరణ్

ఎడిటర్ : శివ శర్వాని

తేజస్ , కరిష్మా కార్పల్ హీరో హీరోయిన్లుగా ఏం వి ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం మనసా .. వాచా . మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

చైతూ (తేజస్), స్వాతి (కరిష్మా కార్పల్ ) రీసెర్చ్ స్కాలర్స్ గా లండన్ లోని ఒక మెడికల్ ఇనిస్టిట్యూట్ లో పనిచేస్తుంటారు. ఈ క్రమంలో స్వాతి ని ఇంప్రెస్ చేసి ఆమె ను లవ్ లో పడేయడానికి ట్రై చేస్తాడు చైతూ. ఈ క్రమంలో క్యాన్సర్ ను సులభంగా నయం చేసుకునేలా మందును కనిపెట్టి స్వాతిని ఇంప్రెస్ చేసి ఆమె ను లవ్ చేసేలా చేస్తాడు. ఈక్రమంలో ,చైతూ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు? ఇంతకీ చైతూ ని కిడ్నాప్ చేయడానికి గల కారణాలు ఏమిటి ? ఆతరువాత మళ్ళీ చైతూ , స్వాతి కలిసారా ? అనేదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటే హీరో పాత్రే. చైతూ పాత్రలో తేజస్ ఫుల్ ఎనర్జిటిక్ గా నటించాడు. ఇక హీరోయిన్ కరిష్మా కార్పల్ కు ఇదే మొదటి సినిమా అయినా అటు నటన పరంగా అలాగే గ్లామర్ తో కూడా పర్వాలేదనిపించింది.

ఇక స్క్రీన్ మీద కనపడింది కొద్దీ సేపయినా తన కామెడీ తో నవ్వించాడు తాగుబోతు రమేష్. అలాగే విలన్ పాత్రలో నటించిన జబర్దస్త్ నవీన్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ను తెరమీదకు తీసుకురావడంలో దర్శకుడు చాలా చోట్ల తడబడ్డాడు. బోరింగ్ నరేషన్ తో సినిమా ను సదాసీదాగా మార్చాడు. హీరో వైరస్ కు ఒక్క నైట్ లో మందు కనుక్కోవడం మళ్ళీ దాన్ని తన మీదే ప్రయోగించుకోవడం వంటి సన్నివేశాలు చాలా సిల్లీ గా అనిపిస్తాయి.

ఇక సినిమా లో ట్విస్టులు లేకపోవడం అలాగే ఎంటర్ టైన్మెంట్ కూడా లేకపోవడం వంటి విషయాలు కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. వీటితో పాటు సినిమాలో తాగుబోతు రమేష్ , నవీన్ తప్ప తెలిసిన వాళ్ళు లేకపోవడం తో వారి నటనకు కనెక్ట్ కాలేము.

సాంకేతిక విభాగం :

లవ్ స్టోరీ కి ఒక సెన్సబుల్ ఇష్యూ ని జోడించి దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం విజయం సాధించలేదనే చెప్పాలి. బోరింగ్ నరేషన్ ,లాజిక్ లేని సన్నివేశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతిశాయి. ఇక మిగిలిన టెక్నిషన్స్ విషయానికి వస్తే కేశవ కిరణ్ అందించిన సంగీతం యావరేజ్ గా వున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. శివ శర్వాణి ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

తీర్పు :

ఎంవీ ప్రసాద్ దర్శకత్వంలో రొమాంటిక్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మనసా.. వాచా లో లీడ్ పెయిర్ నటన హైలైట్ అవ్వగా బోరింగ్ నరేషన్ , లాజిక్ లేని సన్నివేశాలు సినిమా కు మైనస్ పాయింట్స్అయ్యాయి . చివరగా ఈ చిత్రం ఏ ఒక్క వర్గానికి కూడా కనెక్ట్ అవ్వడం కష్టమే.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook