ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మనసులోని మాట’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

m 1

అజిత్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పోచంబావి గోపీకృష్ణ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మనసులోని మాట’. మేదిగిరెడ్డి హనుమంతరెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ధర్మారెడ్డి, పోచంబావి గోపికృష్ణ, ఆధ్యా శర్మ, అబిత్, మహదేవ్, పార్వతి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ఈటీవీ విన్ OTTలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహంచారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు ఉత్తేజ్, జబర్దస్త్ అప్పారావు, అల్దాప్ అథితులుగా హాజరయ్యారు. చిన్నచిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఇద్దరు యువకులకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగి ఎలా విజయం సాధించారన్నదే ఈ చిత్ర కథ. కథ మొత్తం హాస్యంతో కూడకుని ప్రేక్షకులను ఆనందింపజేస్తుందని చిత్ర యూనిట్ తెలిపారు.

Exit mobile version