‘కొక్కొరొకో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అందాల భామ మనస్విని బాలబొమ్మల

Untitled 1 2

యువ నటి మనస్విని బాలబొమ్మల తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆమె ‘కొక్కొరొకో’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. “మా బంగార్రాజు కుటుంబం తరఫున మీకు సంక్రాంతి శుభాకాంక్షలు” అనే సందేశంతో ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ పోస్టర్‌లో మనస్విని బాలబొమ్మల ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో ఆమె కనిపించారు. ఈ సినిమాలో ఆమె గెస్ట్ రోల్‌లో నటించినప్పటికీ, ఇది ఆమె అధికారిక తెలుగు సినిమా ఎంట్రీ కావడంతో ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. థియేటర్ అనుభవం, పేరిణి నాట్యం, కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన మనస్విని తన ట్యాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

‘కొక్కొరొకో’ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తొలిసారి నిర్మాతగా ఆర్‌వి ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ వసంతల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోడి పందేల నేపథ్యంతో ఐదు పాత్రల చుట్టూ తిరిగే అంథాలజీగా తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంకీర్తన్ సంగీతం, ఆకాశ్ ఆర్ జోషి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version