వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “మంచి రోజులు వచ్చాయి”

Published on Nov 24, 2021 3:02 pm IST


సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రిన్ హీరోయిన్ గా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రం నవంబర్ 4 వ తేదీన విడుదల అయ్యి సూపర్ హిట్ విజయం సాధించింది. వీ సెల్యులాయిడ్ మరియు ఎస్కేఎన్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ ను ఆహా వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 3 వ తేదీన ఆహా వీడియో లో ప్రసారం కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆహా వీడియో లో కూడా విజయం సాధిస్తుంది అని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :