మారుతి మార్క్ తో “మంచి రోజులొచ్చాయ్” ట్రైలర్.!

Published on Oct 14, 2021 9:08 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ రీసెంట్ గా తన “ఏక్ మినీ కథ” చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక దీని తర్వాత చాలా తక్కువ టైం లోనే స్టార్ దర్శకుడు మారుతితో కంప్లీట్ చేసేసిన సినిమానే “మంచి రోజులొచ్చాయ్”. మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

అయితే ఈ ట్రైలర్ ని చూస్తుంటే మళ్ళీ మారుతి తన అసలైన మార్క్ చూపించినట్టు అనిపిస్తుంది. తన కెరీర్ ఆరంభంలో తీసిన సినిమాల్లో ఒక మార్క్ ను మారుతీ చూపించారు. అయితే అప్పుడు అడల్ట్ కంటెంట్ ఎక్కువయ్యింది అని కామెంట్స్ వచ్చినా తర్వాత మిగతా సినిమాలు కూడా తియ్యగలను అని సమాధానం ఇచ్చారు. అయితే మళ్ళీ ఈ చిత్రంతో అడల్ట్ కంటెంట్ లేకుండా అదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కొన్ని పాత్రలని సృష్టించి ఎంటర్టైన్ చేసేలా ఉన్నారనిపిస్తుంది.

ఇక అలాగే సంతోష్ మరియు మెహ్రీన్ ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కనిపిస్తుంది. అలానే మారుతీ మార్క్ కామెడీతో ట్రైలర్ అయితే ఫన్ ఫిల్డ్ గా అనిపిస్తుంది. అలాగే అనూప్ రూబెన్స్ సంగీతం కూడా బాగుంది. ఇక యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :