మంచి రోజులు వచ్చాయి ‘సో.. సోగా” పాటకు అదిరే రెస్పాన్స్..!

Published on Sep 22, 2021 1:00 am IST


యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్‌ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మంచి రోజులు వచ్చాయి”. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి గత నెలలో ‘సో సోగా ఉన్నాననీ.. సో స్పెషలే చేశావులే’ అంటూ సాంగే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సాయిధరమ్‌ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ క్లాసిక్ మెలోడీకి యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

అనూప్ రూబెన్స్ సంగీతం, కేకే సాహిత్యం, సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో 50 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, వైవా హర్ష, సుదర్శన్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తుండగా త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :