మా ఎలక్షన్స్: 14 వాగ్దానాల తో మేనిఫెస్టో ను విడుదల చేసిన మంచు విష్ణు..!

Published on Oct 7, 2021 5:02 pm IST

ఈ ఏడాది మా ఎన్నికల్లో గట్టి పోటీ నెలకొని ఉంది అని చెప్పాలి. ఒక పక్క ప్రకాష్ రాజ్ మరొక పక్క మంచు విష్ణు లు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంచు విష్ణు 14 వాగ్దానాల తో కూడిన మేనిఫెస్టో ను విడుదల చేయడం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు నాయకత్వం లోని స్వచ్ఛమైన తెలుగు ప్యానెల్ ను ఆశీర్వదించండి, తెలుగు సినీ పరిశ్రమ ఆత్మ గౌరవం కాపాడుకుందాం అని అన్నారు.

ఈ మేరకు 14 వాగ్దానాలను గురించి వివరించారు. అందులో మొదటిది అవకాశాలు. మా యాప్ క్రియేట్ చేసి, మా పోర్ట్ ఫోలియో క్రియేట్ చేస్తాం అని, ఇలా చేయడం ద్వారా ఓటిటి మరియు సినిమాలలో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం అని అన్నారు. రెండవది మా భవనం. మా లో ఉన్న సభ్యుడికి ఉపయోగ పడే విధంగా మా భవనం ఏర్పాటు. మూడవది సొంత ఇంటి కల. అర్హులైన వారికి ప్రభుత్వ సహకారం తో శాశ్వత నివాస గృహ నిర్మాణం.

ఇదే తరహాలో ప్రతి ఒక్కరికీ వైద్య సహాయం అందిస్తామని అన్నారు. ఆరోగ్య భీమా, కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం, ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత మెడికల్ టెస్టుల నిర్వహణ, ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డ్స్ అంటూ హామీ ఇచ్చారు. ఐదవది చదువుల తల్లి. మా సభ్యుల పిల్లలకు కేజీ నుండి పీజీ వరకూ విద్యా సహాయం అని అన్నారు. ఆరవది కళ్యాణ లక్ష్మీ. ఈ పథకం ద్వారా లక్షా పదహారు వేల ఆర్థిక సహాయం.

ఇలా మహిళా రక్షణ హై పవర్ కమిటీ, వృద్ధ కళాకారుల సంక్షేమం. సీనియర్ సిటిజన్స్ కి ఓటు హక్కు వచ్చేలా ఏ జీ ఎం లో ఆమోదం తెచ్చుకొని అమలు చేస్తామని అన్నారు. అదే తరహాలో మా మెంబర్ షిప్ కార్డ్, మా ఉత్సవాలు, కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు సక్రమంగా అందేలా చూడటం. మోహన్ బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ప్రభుత్వాల సహయ సహకారాలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వాగ్దానాల ను నెరవేర్చడం కోసం తనను, తన ప్యానెల్ సభ్యులను గెలిపించాలని ప్రార్థించారు.

సంబంధిత సమాచారం :